నొట్టు స్వరాలు

పాశ్చ్యాత జీవిన విధానం, సంస్కృతి ప్రభావం నేడు మనపై చాలా ఉందని పదే, పదే అంటుంటాం. దానికి కారణం, ఆంగ్లేయులు చాలాకాలం మన దేశాన్ని పరిపాలించటం కావచ్చు. అలాగే, పాశ్చ్యాత సంగీతం కూడా మన పూర్వీకులని, సంగీతజ్ఞులను అమితంగా ప్రభావితం చేసిందనటంలో సందేహంలేదు. సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారే అందుకు నిదర్శనం. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించిన కాలంలో చెన్నపట్టణంలోని సెయింట్ జార్జ్ ఫోర్టులో జరిగే ఆంగ్లేయుల బ్యాండ్ వీక్షించి ప్రభావితులైన దీక్షితారు వారు ఆంగ్ల సంగీతానికి ప్రభావితులై ఆ బాణీలను అనుకరిస్తూ, కర్ణాటక సంగీతంలో ‘నొట్టు స్వరాల’ పేరిట రచనలు చేశారు. దాదాపు 30, 40 రచనల దాకా ఉన్న ఈ నొట్టుస్వరాలకు ఆంగ్ల జానపద గీతాలతోపాటు ఐర్లాండు, స్కాంట్లాండు జానపద సంగీతం కూడా ప్రేరణగా నిల్చాయి.

పాశ్చ్యాత, కర్ణాటక సంగీతానికి వారధిగా నిలిచిన ఈ నొట్టు స్వరాలు పాశ్చ్యాత సంగీతంలో ‘సి’ మేజర్ స్కేలుకు దగ్గరగా ఉండే, శంకరాభరణ రాగంలో తిశ్ర, చతురశ్ర ఏకతాళాలలో రచించబడ్డాయి. పాశ్చ్యాత సంగీతంలో ఈ తాళ నిబద్ధతను 3/4 , 4/4 లయగా వ్యవహరిస్తారు. ఆంగ్లంలో ‘నోట్’ అంటే స్వరం అని అర్ధం. ఈ పదం భాషానుగుణంగా రూపాంతరం చెంది నొట్టుగా మారింది. విలియం బ్రౌన్ అనే ఆంగ్ల అధికారి అభ్యర్థన మేరకు ఆంగ్ల బాణీలకు సంస్కృతంలో పదరచన చేసి, కర్ణాటక బాణీలతో ముత్తుస్వామి దీక్షితార్ మెరుగులు దిద్దినట్టుగా చరిత్రకారులు చెపుతున్నారు. మొదట కేవలం 13 నొట్టు స్వరాలనే ముత్తుస్వామివారు రచించారు. చాలా వరకు నొట్టుస్వరాల సాహిత్యం సంస్కృతంలోనే రచించినా, కొన్ని తెలుగులో కూడా కూర్చారు. నొట్టు స్వరాలలో కూడా దీక్షితార్ వారి ముద్ర ‘గురుగుహ’ మనకు కన్పిస్తుంది. విచిత్రంమేమంటే, ఈ నొట్టు సాహిత్యాన్ని ముత్తుస్వామి దీక్షితార్ తన మొదటి కృతి రచించడానికి చాలాకాలం ముందే రచించారు. ముత్తుస్వామివారి సమకాలీకులైన మోజార్ట్, బేథోవన్ల ప్రభావం కూడా వారిపై మనకు కన్పిస్తుంది. వారి రచనలను అనుకరించి కూడా కర్ణాటక సంగీతంలో ముత్తుస్వామి వారు నొట్టు స్వరాలను, ఇతర కృతులను రచించారు.

కర్ణాటక సంగీతంలో ప్రధానంగా కన్పించే గమకాలు ఈ నొట్టు స్వరాలలో ఉండవు. అందువల్ల ప్రాథమిక సంగీత అభ్యాసకులకు ఇవి పాడుకొవడానికి వీలుగా ఉంటాయి. అలాగే ఇవి గణపతి, సరస్వతి, శివుడు, విష్ణువు, రాముడు, స్కంధుడు, మరియు ఆంజనేయుడు వంటి దేవతామూర్తులను, శ్రీనగరం, కంచి, తిరుపతి, మథుర వంటి పుణ్య క్షేత్రాలను కీర్తించే చిన్న, చిన్న ప్రార్థనా గీతాల రూపంలో ఉంటాయి. కర్ణాటక సంగీతంలోని గీతాలు, కీర్తనలలో లక్షణాలకు విరుద్ధంగా పల్లవి, అనుపల్లవి, చరణాలు ఈ నొట్టు సాహిత్యంలో ఉండవు.

నొట్టు సాహిత్యానికి ఆలంబనగా నిలిచిన పాశ్చ్యాత గీతాలలో ప్రముఖమైనవి, ‘సంతానం పాహిమాం, సంగీత శ్యామలే’ – ‘గాడ్ సేవ్ ద కింగ్’, ఇది ఇంగ్లాండు జాతీయ గీతం. అలాగే, ‘శ్యామలే మీనాక్షి’కి ప్రేరణ మోజార్ట్ 12 వేరియేషన్స్ లోని ‘ఆహ్ ఔస్ డిరైజే మామన్’ అనే ఫ్రెంచ్ జానపద గీతం పిల్లల పాట ‘ట్వింకిల్, ట్వింకిల్ లిటిల్ స్టార్’కి కూడా ఈ బాణీయే ప్రేరణ. ఇక ఐరిష్ గీతం ‘లిమరిక్’ ఆధారంగా ‘వందే మీనాక్షీం’, ‘ఓల్జ్ వాజ్ డాన్సర్’ బాణీలో ‘శక్తి సహిత గణపతిం’ రచించబడ్డాయి.


నొట్టు స్వరము		      పాశ్చాత్య సంగీత ప్రేరణ

సంతతం పాహిమాం సంగీత శ్యామలే	    God save the King/queen – British National Anthem
శ్యామలే మీనాక్షీ		        Twinkle twinkle little star. Based on French tune ‘Ah! Vous dirai-je’    
జగదీశ గురుగుహ				Lord MacDonald’s Reel
పీతవర్ణం భజే				Persian verse ‘taza ba-taza nau ba-nau’ with English jingle
సుబ్రహ్మణ్యం సురసేవ్యం			British Army regimental march – British Grenadiere
కంచీశం ఏకాంబరం			Country dance
రామచంద్రం రాజీవాక్షం			Let us lead a life of Pleasure
సకల సురవినుత				Quick March
శక్తి సహిత గణపతిం			Voleuz –Vous-dancer
శౌరి విధినుతే				Oh Whistle and I will come to you, my lad.
వర శివబాలం				Castilian Maid
కమల వందిత				Playful tune of ‘Galopede’ folk dance
వందే మీనాక్షీ				Limerick

నొట్టు స్వర సాహిత్యం

1. సంతతం పాహిమాం సంగీత శ్యామలే సర్వాధారే జనని
  చింతితార్థప్రదే చిద్రూపిణి శివే శ్రీ గురుగుహ సేవితే శివ మోహాకారే

2. శ్యామలే మీనాక్షీ సుందరేశ్వరసాక్షి శంకరీ గురుగుహ సముద్భవే శివేవా
  పామరలోచని పంకజలోచని పద్మాసనవాసిని హరి లక్ష్మివినుతే శాంభవి

3. జగదీశ గురుగుహ హరవిధి వినుతం దేహాత్రయ విలక్షణమానంద లక్షణం
  నిత్యం శుద్ధం బుద్ధం ముక్తం సత్య నిర్వికల్పం నిశ్ప్రపంచమానంద మజం

4. పీతవర్ణ భజే భైరవం భూత వేతాళ సంసేవ్యమానం
  పీత వస్త్రం సువర్ణప్రదం వీతరాగం గురుగుహాత్మజం

5. కంచీశం ఏకామ్రనాయకం నిత్యమహం భజే కామాది షట్చోరవృత్తమహం త్యజే
  పంచాక్షర స్వరూపమాగమాంతసారం పంచాస్యమాది కారణం విశ్వేష్వరం గురుగుహం

6. రామచంద్రం రాజీవాక్షం శ్యామళాంగం శాష్వత కీర్తిం కోమలహస్తం కోశలరాజం
  మామక హృత్కమలాకరం మారుతియుక్తం ధిమంతం మానిత భక్తం శ్రీమంతం
  కౌమారవరం గురుగుహ మిత్రం కారుణ్యనిధిం దశరథ పుత్రం భూమిసుతాభం
  భూపతి రూపం కోమల పల్లవ పాదం మోదం కామగురుం సితారామం కౌస్తుభభూశం వందేహం

7. శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సుర రాజ వినుత సేవితం
  భక్తాళిపోషకం భవసుతం వినాయకం భక్తిముక్తిప్రదం భూశితాంగం రక్తపదాంబుజం భావయామి

8. వరశివ బాలం వల్లీలోలం వందే నందం హరిహరమోదం హంసానందం హససముఖం
  గురుగుహ రూపం గుప్తాకారం ఘోరక్షంతం సురపతిసేనంసుబ్రహ్మణ్యం సురవినుతం

9. వందే మీనాక్షి త్వాం సరసిజ వక్రే పర్ణే దుర్గే నటసుర బృందే శక్తే గురుగుహ పాలిని జలరుహచరణే
  సుందర పాండ్యానందే మాయే సూరిజానాధారే సుందరరాజ సహోదరి గౌరి శుభకరి సతతమహం

10. శౌరి విధినుతే శాంభవి లలితే శాంతే అతీతే శంకరముదితే గౌరి సురహితై ఏకామ్రపతియుతే
   కామాక్షీ మాం పాహి వీరవర వినుత చరణాంభోజే ఘోరతమలయవర హిమగిరిజే
   శూరహరణ గురుగుహ మాతహ సంసారతర చరణతర కమలే

11. కమలాసన వందిత పదాబ్జే కమనీయ కరోదయ సామ్రాజ్యే కమలానగరే సకలాకరే
   కమల నయన ధృత జగదాధారే కమలే విమలే గురుగుహ జనని కమలాపతినుత
   హృదయే మాయే కమల శశి విజయ వదనే అమేయే కమలేంద్రాణి వాగ్దేవి శ్రీ గౌరీపూజిత
   హృదయానందే కమలాక్షి పాహి కామాక్షి కామేశ్వరసతి కల్యాణి

12. సకల సురవినుత శంభో స్వామిన్ వికట గురుగుహ విజయ త్రిపురహర ఏకామ్రపతే
   కరుణామూర్తే ఏకానేక విభూతే ఏకాంత హృదయ ఏకభోగ దాయకనందకర విభో

13. సుబ్రహ్మణ్యం సురసేవ్యాబ్జపదం సుందర వదనం సుకుమార వినుత లావణ్యం
   శుభగాత్రం శుభకర నేత్రం సోమాత్మకమాశ్రిత కల్పభూరుహం
   సూరి గురుగుహం సురరాజ విధి వినుతం సర్వజ్ఞం సుమతే చింతయ గురునాథం
   స్వజ్ఞాన విదారణ ఫణితం సాధుజన సూనృత వచనం

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *