భాష

భాష

‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక మాయరోగం’ అని తాత్వికుల అభిప్రాయం. పెద్దగా నవ్వటం అమృత హృదయుని లక్షణమని పెద్దలంటారు. ‘‘నవ్వును జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్త వృత్తికిన్ దివ్వెలు – కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్ పువ్వులు వోలె ప్రేమరసముల్ వెలిగ్రక్క విశుద్ధమైనవే నవ్వులు – సర్వము దుఃఖదమనం.....
సాహిత్యం సామాజిక స్థితిగతులకు ప్రతిబింబం. ప్రతి రచయిత తాను జీవించిన సమాజ వ్యవస్థను తన రచనలలో పొందుపర్చి ముందు తరాల వారికి అందజేయటం సర్వసాధారణం. శ్లోకం, పద్యం, గేయం, కథ, కీర్తన, పురాణం, ఇతిహాసం సాహిత్యం ఏ రూపంలో ఉన్నా ఆయా సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక వ్యవస్థకు సాక్షీభూతాలుగా నిలుస్తాయి. రచయిత సామాజిక, మానసిక వికాసాన్ని పెంపొందించే ధర్మ,.....
పోతనగారి భాగవతం ప్రథమ స్కంధంలో “శ్రీకృష్ణుఁడు ద్వారకా నగరంబు ప్రవేశించుట”, “శ్రీకృష్ణుఁడంతఃపుర కాంతలం జూడఁబోవుట” అనే కథలు ఉన్నాయి. హస్తినాపురమునుండి శ్రీకృష్ణుడు తిరిగి తమ ద్వారకకు వచ్చాడని తెలుసుకొన్న పుర జనులందరూ ఆనందముతో గానం చేస్తూ, నృత్యాలు చేస్తూ ఆయనకు స్వాగతం ఇస్తారు. అందరి సత్కారాలు అందుకొని, అందరితో సంభాషించి, అందరి య.....
నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు బైటకుక్క చేత భంగపడును స్థానబలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ! నీటి నుంచి బయటపడ్డ మొసలిని కుక్క కూడా బాధిస్తుంది. అదే నీళ్లలోని మొసలి ఏనుగును కూడా పీడించగలదు. ఈ అర్ధాన్ని తెలియచేసే పురాణగాథే భాగవతంలోని గజేంద్ర మోక్షం కథ. త్రికూట పర్వతం చుట్టు పక్కల, పర్వతం మీద దట్టమైన అరణ్యాలు లెక్క.....
తెలుగు తీయనైనది. సొగసైన నుడికారం కలది. మధురమైన కవితలు కలది. సొగసైన రచనలు, సామెతల, జాతీయాల, సూక్తుల సొబగును కూర్చుకున్న మధుర భాష. ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు, అన్నీ ఉన్న ఈ భాషను, సంస్కృతిని పరిరక్షించే తెలుగువారు ఆనాడు, ఈనాడు కూడా కరువయ్యారు. ఇక తెలుగు గ్రామీణుల జీవన విధానం, ఆచార వ్యవహారాలు, పండగలు పబ్బాలు, గ్రామీణ దేవతలు, పూ.....
హరికిదొరికెనందురా సిరియపుడె దొరికెకాదె విషము హరునకరయ ఎవనికెట్టులగునొ ఎవ్వడెరుంగును విశ్వదాభిరామ వినురవేమ క్షీరసాగర మథనం క్షీరసాగర మథనంలో ప్రభవించిన శ్రీ మహాలక్ష్మి శ్రీ హరిని చేరింది. అప్పుడే పుట్టిన హాలాహలాన్ని హరుడు మింగటంతో ఆ విషం శివుని కంఠంలో స్థిరపడింది. దేవదానవులు మందరగిరి వద్దకు వెళ్లి దానిని సాగరంలోకి చేర్చాలన.....
అధిక్షేప శతక కర్తలలో ఆద్యులు కవిచౌడప్ప, వేమన, కూచిమంచి సోదరులు, అడిదము సూరకవి అనువారు ప్రముఖులు. చౌడప్ప ఆనాటి మండలేశ్వరుల, అధికారుల, ధనికుల అభిరుచినే ఆయుధముగా గ్రహించి, వారి పద్ధతి లోనే బూతులలో నీతులు చొప్పించినాడు. బూతులు కేవలం ఆశ్లీలోక్తులు కావు. వ్యంగ్య చమత్క్రుతులతో, కవితా సంపదతో, అధిక్షేపాత్మకమైన నీతిబోధనలతో పూర్ణములయినవి. ఆత.....
పెద్దవాళ్లు ఏదైనా మాట్లాడే ముందు ‘ఏదో సామ్యం చెప్పినట్టు’ అనడం కద్దు. ఈ సామ్యం లేదా సామ్యత నుంచి వచ్చినదే ‘సామెత.’ సామెతనే లోకోక్తి లేదా నానుడి అని కూడా అంటారు. సామ్యత అంతే పోలిక, ఒక ఉదాహరణ, ఒక దృష్టాంతం. "లోకోక్తిముక్తావళి" అనే సంకలనం ఉపోద్ఘాతంలో సామెతను ఈ విధంగా నిర్వచించారు -- సంస్కృతమున "లోకోక్తులు" లేదా "న్యాయములు" అనువానిని తెలుగు.....
కావ్యం కవితలు చెపుతుంది ఇతిహాసం హితవులు చెపుతుంది పురాణం బుద్ధులు చెపుతుంది శతకం సూక్తులు చెపుతుంది అలాంటి శతకాలలో వేమన, సుమతీ, దాశరధీ శతకాలు తెలియని, చదవని తెలుగువాడుండు. చిరుప్రాయంలోనే పిల్లలకు ఈ నీతి శతకాలను వల్లెవేయించి, ముద్దు,ముద్దుగా వారు ఆ పద్యాలు చదవుతుంటే మురిసిపోవటం కద్దు. అక్షరాభ్యాసానికి ముందే సుమతి, వేమనాది సూక్త.....
ఈ కాలంలో ఎవరైనా తెలుగువారితో కలుషితంలేని, కలగూరగంప కాని తెలుగులో అంటే, ఇంగ్లీషు, హిందీలాంటి పదాలు వాడకుండా మాట్లాడితే, స్వాతి, ఆంధ్రప్రభ తదితర పత్రికలలో అచ్చుగాని నవలల పేర్లు చెప్పినా మాకు అంతగా తెలుగురాదండీ, సాహిత్యం గురించి తెలియదండీ అనడం మామూలైపోయింది. ఇక విదేశాల్లో పెరుగుతున్న మా పిల్లలకి పెద్దమనుష్యులు, నర్తనశాలలాంటి పాత సి.....