
బుఱ్ఱలే రెండైదులున్నా
బుద్ధిమాత్రం నీకు సున్నా
అరే అంటా వెవడురా నువ్వు?
శ్రీరామబంటును
ఒరే అంటా వెవడురా నువ్వు?
కోతియంటూ ప్రేలితివి నీ
మూతిపై తన్నెదను కానీ
రాముడికి నిన్నట్టే పెట్టాను
నేపోయి వెంటనె
రాము నిపుడే పట్టుకొస్తాను
ఈ రావణ, హనుమంతుని సంవాదం నదీరా రచించిన సంపూర్ణ రామయణం అనే బుఱ్ధకథలోనిది. తెలుగునాట వెలుగొందిన అనేకానే.....
పెద్దవాళ్లు ఏదైనా మాట్లాడే ముందు ‘ఏదో సామ్యం చెప్పినట్టు’ అనడం కద్దు. ఈ సామ్యం లేదా సామ్యత నుంచి వచ్చినదే ‘సామెత.’ సామెతనే లోకోక్తి లేదా నానుడి అని కూడా అంటారు. సామ్యత అంతే పోలిక, ఒక ఉదాహరణ, ఒక దృష్టాంతం. "లోకోక్తిముక్తావళి" అనే సంకలనం ఉపోద్ఘాతంలో సామెతను ఈ విధంగా నిర్వచించారు -- సంస్కృతమున "లోకోక్తులు" లేదా "న్యాయములు" అనువానిని తెలుగు.....
ప్రజల సంభాషణల్లో తరచూ చోటు చేసుకుని కాలక్రమేణా భాషలో స్థిరత్వాన్ని పొందే పదాలను, వ్యాఖ్యలను జాతీయాలు లేదా నానుడులు అంటారు. వీటినే ఇంగ్లీషులో “idioms” అంటారు. మనకు తెలియకుండానే అనేక జాతీయాలను మన సంభాషణల్లో ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకు అరికాలిమంట నెత్తికి ఎక్కింది, తూచా తప్పకుండా, ఈడు, జోడు, అడుగులకు మడుగులొత్తడం, కట్టె, కొట్టె, తెచ్చె, మొదలగ.....
మన వేదాలను, ఉపనిషత్తులను తరిచి చూస్తే నేటి ఆధునికయుగంలో కన్పించే అనేకానేక శాస్త్రవిజ్ఞాన విశేషాలు మనకు కన్పిస్తాయి. వీటి గురించి నేడు మనకు అంటే సామాన్య ప్రజానీకానికి తెలిసింది అణుమాత్రమే. మన పురాణాలు మనకేమిచ్చాయి అనే చచ్చు ప్రశ్నొకటి అడగటం నేడు మనం అలవాటు చేసుకున్నాం. ఆ విషయాలను గ్రహించడానికి మనకు ఆయా పురాణాలు చదవే నైపుణ్యమేది? .....
మూలకథ రచన: ఆస్కర్ వైల్డ్
నగరంలోని ఎత్తైన ప్రాంతంలో ఒక స్థూపం మీద ఆనందాలు చిమ్ముతున్న ఒక రాజకుమారుని విగ్రహం ఉంది. ఒళ్లంత బంగారంతో పోత పోయబడి, మెరుపులు వెదజలుతున్నరెండు నీలమణులు పొదిగిన కళ్లతో, ఒరలో ఒక పెద్ద పగడం తాపిన ఖడ్గంతో నాలుగుదిశలా ఆ రాకుమారుడు ప్రకాశిస్తున్నాడు. అందరూ అతనిని ‘సంబరాల రాకుమారుడ’ని (హ్యాపీ ప్రిన్స్) పిలుస్తార.....
అమరావతీ నగర అపురూప శిల్పాలకు అక్షర రూపం, కృష్ణానదీ తరంగాలలో కొట్టికొని పోతున్న వేలాది ఊసులకు సజీవ రూపం శంకరమంచి సత్యంగారి 100 కథల సంపుటి ‘అమరావతి కథలు.’ ‘‘అమరావతిలో పూచిన పూలు, రాలిన పూలు, వీచిన గాలి, ప్రవహించే నీరు, మట్టి, పిట్టలు, మనుషులు, రంగులూ, రుచులు అన్నీ ఈయనకు అణువణువునా అమరిపోయాయి. ఆయన సైద్ధాంతికుడు కాదు. మాంత్రికుడు. కథకుడు. శిల.....
సాహిత్యం సామాజిక స్థితిగతులకు ప్రతిబింబం. ప్రతి రచయిత తాను జీవించిన సమాజ వ్యవస్థను తన రచనలలో పొందుపర్చి ముందు తరాల వారికి అందజేయటం సర్వసాధారణం. శ్లోకం, పద్యం, గేయం, కథ, కీర్తన, పురాణం, ఇతిహాసం సాహిత్యం ఏ రూపంలో ఉన్నా ఆయా సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక వ్యవస్థకు సాక్షీభూతాలుగా నిలుస్తాయి. రచయిత సామాజిక, మానసిక వికాసాన్ని పెంపొందించే ధర్మ,.....
రచయిత: ఎన్ తారక రామారావు
‘‘డాక్టరుగారు! మా బాబుని చూడండి ఎలాగైనాడో?’’
డాక్టరు విశ్వరూపం బాబుని చూశాడు. అతని తల్లి భూదేవి ఆత్రుత, ఆందోళన గమనించాడు.
‘‘అసలేం జరిగింది?’’
‘‘బాబుకు నీళ్లుపోశాను. పౌడరద్దాను. లాగు చొక్కా వేశాను. కాళ్లకు సాక్స్ తొడిగాను. బూట్లు వేశాను!’’
‘‘ఊ! తర్వాత?’’
‘‘ఆడుకో బాబూ అని పంపాను!’’
‘‘ఎక్కడకూ?’’
‘‘సుందర నం.....
నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు
బైటకుక్క చేత భంగపడును
స్థానబలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినురవేమ!
నీటి నుంచి బయటపడ్డ మొసలిని కుక్క కూడా బాధిస్తుంది. అదే నీళ్లలోని మొసలి ఏనుగును కూడా పీడించగలదు. ఈ అర్ధాన్ని తెలియచేసే పురాణగాథే భాగవతంలోని గజేంద్ర మోక్షం కథ.
త్రికూట పర్వతం చుట్టు పక్కల, పర్వతం మీద దట్టమైన అరణ్యాలు లెక్క.....
రచన: కొడవటిగంటి కుటుంబరావు
ఆరోజు పంతులు మాకయిదు లెక్కలిచ్చాడు. అయిదింటికి అయిదు మార్కులూ తెచ్చుకున్నాను… మర్నాడు మళ్ళీ మామూలే.
ఆరోజు మాఅమ్మా నాన్నా పోట్లాడుకోలేదు. మా అమ్మ చెప్పిందల్లా మా నాన్న ఒప్పుకున్నాడు. ఆయన చెప్పిందల్లా ఆవిడ ఒప్పుకుంది. మా కొంప నెవరో మంత్రించినట్టయింది…. తరవాత మళ్లీ యథాప్రకారమే.
జీవితం ఈ విధంగా ఒక చిన్న వ.....
‘‘యతోధర్మస్తతోజయః’’ – ధర్మం ఎక్కడున్నదో అక్కడే జయం. ఇవి గాంధారి దుర్యోధనుని ఆశీర్వదిస్తూ అన్నమాటలు. అటువంటి ధర్మానికి ప్రతీకగా నిలిచి ధర్మక్షేత్రంలో విజయాన్ని పొందిన ధర్మరాజునకు యక్షుడు అరణ్య పర్వంలో సంధించిన ప్రశ్నలే యక్షప్రశ్నలు. ఈ ప్రశ్నోత్తరాలలో ధర్మం, సత్యం, తపస్సు, యజ్ఞం, దానం, త్యాగం వంటి సద్గుణ స్వభావాలు, కామక్రోధలోభ మదమ.....
మూలకథ రచన: రే బ్రాడ్ బెరి
లోపల గదిలో గోడ గడియారం టిక్.. టాక్.. అంటూ నెమ్మదిగా కదులుతోంది. అంతలోనే గడియారం నుంచి మంద్రస్థాయిలో సమయం ఏడయింది... లేవండి.. ఏడయింది లేవండి... అని ఒక గొంతు ఆత్రుతగా విన్పించింది. ఆ సూర్యోదయం వేళ ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించింది. గడియారం ముల్లు చప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తుంటే, సమయం ఏడు తొమ్మిది.. 7.09, అల్పాహార సమయం అన.....