
కావ్యం కవితలు చెపుతుంది
ఇతిహాసం హితవులు చెపుతుంది
పురాణం బుద్ధులు చెపుతుంది
శతకం సూక్తులు చెపుతుంది
అలాంటి శతకాలలో వేమన, సుమతీ, దాశరధీ శతకాలు తెలియని, చదవని తెలుగువాడుండు. చిరుప్రాయంలోనే పిల్లలకు ఈ నీతి శతకాలను వల్లెవేయించి, ముద్దు,ముద్దుగా వారు ఆ పద్యాలు చదవుతుంటే మురిసిపోవటం కద్దు. అక్షరాభ్యాసానికి ముందే సుమతి, వేమనాది సూక్త.....
కొన్ని నెలల విరామం తర్వాత స్నేహితుల ప్రోద్భలంతో తిరిగి నాకు తోచిన విషయాలపై వ్యాసాలు రాద్దామని కూర్చున్నా, ఏ విషయంపై రాయాలి అన్న మీమాంస బయలుదేరింది. ఎక్కడో అక్కడ మొదలు పెట్టకపోతే అసలు రాయడం కుదరదని కూడా అన్పించింది. అదే సమయంలో ఒక బ్లాగ్ లో సినిమా సాహిత్యం, సాహిత్యమేనా అన్న ప్రశ్న కన్పించింది. నిజమే! సినీ సాహిత్యం అంటే ఎందుకు అంత చులక.....
పోతనగారి భాగవతం ప్రథమ స్కంధంలో “శ్రీకృష్ణుఁడు ద్వారకా నగరంబు ప్రవేశించుట”, “శ్రీకృష్ణుఁడంతఃపుర కాంతలం జూడఁబోవుట” అనే కథలు ఉన్నాయి. హస్తినాపురమునుండి శ్రీకృష్ణుడు తిరిగి తమ ద్వారకకు వచ్చాడని తెలుసుకొన్న పుర జనులందరూ ఆనందముతో గానం చేస్తూ, నృత్యాలు చేస్తూ ఆయనకు స్వాగతం ఇస్తారు. అందరి సత్కారాలు అందుకొని, అందరితో సంభాషించి, అందరి య.....
బ్లాగ్లోకంలో ఆమధ్యన కొందరు “నేను మహా మేధావిని, కాదంటే కోస్తా బిడ్డా, భ్యుహహ్హ” అని సవాల్ చేసారు. ఇంకొందరు “నేను లెజండు నే , కాదనే ధైర్యం ఉన్నవాళ్ళు నా ముందుకు రండి. మీ సంగతి తేలుస్తా” అని తొడ గొట్టేరు. లెజెండులు, మహా మేధావులు మధ్య తేడా నాకు తెలియదు. వారి స్థాయికి ఎదగ లేక పోయినా కనీసం మేధావి అనే నా అనిపించు కోవాలని కోరిక మొదలయింది. దురద ప్.....
తెలుగు పద్యము నింటింట త్రిప్పువిద్య
తెలుగు సంస్కృతి ఇన్నేళ్లు నిలుపు విద్య
ఎట్టి విశ్వ భాషలనైనా లేని విద్య
ధ్యానయోగమ్ము మా అవధాన విద్య
అని మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు తెలుగువారికి మాత్రమే సొంతమైన అవధాన విద్య గురించి చెప్పిన మాటలివి. అవధానమంటే, ఏకాగ్రత, ధీవ్యగ్రత. ధారధారణ శక్తుల విలక్షణ సంగమం అన్నారు సినారె.....
ఆంధ్ర వాఙ్మయంలో వెలువడిన అనేకానేక ప్రక్రియలలో శతకప్రక్రియ కూడా విశిష్ట ప్రక్రియే. శతకము అల్ప కావ్యమే అయినప్పటికీ ఒక విశిష్టత లేకపోలేదు. ఉదాత్త కావ్య శ్రేణిలో నిలువలేకపోయినప్పటికి కవితా శక్తి విరాట్ స్వరూపం అందులో పరిపూర్ణంగా ప్రదర్శితం కాకపోయినప్పటికీ, రస చర్చకు తావు లేకపోయినప్పటికీ, కవిహృదయానికది కమనీయ దర్పణము. పండితుల్ని, అప.....
తే.గీ. భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి.
తే.గీ. భరతఖండంబె యొక గొప్ప బందెఖాన
అందులోనున్న ఖయిదీలు హిందుజనులు
ఒక్క గదినుండి మార్చి వేరొక్కగదిని
బెట్టుటెగాక చెరయంచు వేరెగలదె
జాతీయోధ్యమ సమయంలో బిపిన్ చంద్రపాల్ ఇచ్చిన ప్రసంగాల సారాంశానికి ఇచ్చి.....
చాటువులు విజ్ఞానానికి, వినోదానికి, ధారణకు, ఆటపట్టువంటివి. అలంకారికులు చెప్పిన ‘‘వాక్య రసాత్మకం కావ్యం’ అన్న లోకోక్తికి చాటు పద్యాలు చక్కని నిదర్శనాలు. ‘‘చాటు’’ అనే సంస్కృతం మాట తెలుగులో చాటువుగా మారినది. ‘చాటు’ అంటే ప్రియమైనమాట అని అర్ధం. శ్రీ కోట్ర శ్యామల కామశాస్త్రిగారు తమ ‘ఆంధ్రవాచస్సత్వం’లో అప్పుడప్పుడు కవి ఆశువుగా చెప్పిన ప.....
ఉభయ భాషాప్రవీణుడైన అవధాని కథకుడై బ్రహ్మవైవర్తము, దేవీ భాగవతము, మహాభారతము, భాగవతము వంటి పురాణేతిహాస, వేదాంత, ఆథ్యాత్మిక, సాంఘిక, చారిత్రాత్మిక గాథలకు అక్షరరూపాన్నిస్తే, అవి కాలానికతీతంగా జనపథంలో ప్రాచుర్యాన్ని పొంది, తరతరాలుగా నిలిచిపోతాయనడానికి ఉదాహరణే బ్రహ్మశ్రీ మధిర సుబ్బన్న దీక్షితుల వారు రచించిన కాశీ మజలీ కథలు. పండిత, పామరుల.....
‘‘పురా ఆగతా నాగతౌ అణతి కథయతీతి పురాణం’’ – అంటే జరిగిన దానిని, జరుగుతున్న దానిని తెలిపేది పురాణమని అర్ధం. శ్రీ మద్భాగవతం సృష్టి, విసృష్టి, స్థితి, పాలన, కర్మవాసన మన్వంతరం, ప్రళయం, మోక్షం, హరిసంకీర్తనం, దేవతల వర్ణన, వంటి పదిలక్షణాలు కలిగినది పురాణమని నిర్వచించింది. పురాణాలు ఎప్పుడు, ఎలా పుట్టాయో నిర్ధారించటం కష్టం. అయితే, వేదవ్యాసుడు అష్.....
ఈ మధ్య మా స్నేహితులం కొందరం పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుండగా, మా చర్చ తెలుగు భాష మీదకు మళ్లింది. మా స్నేహితురాలు చప్పున ‘తెలుగు భాషలో, తెలుగువారిలో తెలుగు నేతిబీరకాయలో నెయ్యంత’ అని వాపోయారు. చర్చ అక్కడ నుంచి మాంఛీ రసపట్టు మీద సాగిందని మీకు నేను వేరే చెప్పక్కర్లేదనుకుంటాను! చర్చ మాట ఎలా ఉన్నా, ఆవిడన్న మాటల్లో కొంత నిజం లేకపోలేదనిపించ.....
పేరడీ అనగానే మనలో చాలామంది దాన్ని ఏదో వెంట్రుక తీసిపారేసినట్టు పారేస్తారు. పేరడీ అంటే అనుకరుణ. అనుకరించటం అంటే తేలికని మన అభిప్రాయం. తల్లి పిల్లలకు మాటలు నేర్పేటప్పుడు చేసే ప్రయత్నం ఏమిటి? అనుకరణే! కానీ ఆ అనుభూతి వేరు. అది అనుకరణగా అన్పించదు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏవరినో ఒకరిని ఏదో ఒకదాన్ని అనుకరిస్తున్నాం. అనుకరిస్తూనే ఉం.....