‘కర్మణా బధ్యతే జంతుః’ మనిషి కర్మ అనే చక్రబంధంలో చిక్కుకుని ఉన్నాడు. ఈ చక్రబంధనాన్ని చేధించుకుని బయటపడితే కాని జ్ఞానయోగం ప్రాప్తించదు. అయితే కర్మాచరణ గొప్పదా, జ్ఞానం గొప్పదా అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలగకమానదు. కర్మయోగం, జ్ఞాన యోగం రెండూ మోక్షమార్గాలే.
లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురాప్రోక్తా మయా నఘ!
జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయో.....
‘మాసానాం మార్గశిర్షోస్మి’ అన్నాడు గీతాచార్యుడు. అన్నిమాసాలలోకి ఉత్తమమైన ఈ మార్గశిర మాసంలో సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ మాసాన్ని ధనుర్మాసమని పిలుస్తారు. కాలపురుషుడి రాశిచక్రాలలో పదోదైన మకరరాశిలో సూర్యుడు ప్రవేశించే సమయము ఇదే. అలాగే ఈ కల్పం ప్రారంభంలో జలప్రళయం సంభవించినపుడు ఆదివరహావతారమెత్తి భూమిని విష్ణుమూర్.....
14. వామన పురాణం
వామనంబిది పదునాల్గవది తనర్చు
శైవమై కూర్మకల్పకథావిశేష
మయి పులస్త్యుండు సురముని కానతిచ్చి
నది పవిత్రంబు దశసహస్రాత్మకంబు
శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ అవతారమైన వామనావతార మహాత్మ్యాన్ని తెలిపే పురాణమే వామనపురాణం. విష్ణువు చర్మంగా అభివర్ణించబడే ఈ పురాణాన్ని బ్రహ్మ కూర్మకల్పంలో పులస్త్య మహామునికి బోధించాడు. పూర్వభాగం, .....
ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి) అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటి శుద్ధ ఏకాదశులు 12 వుంటాయి. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వున్నా, నాలుగు ఏకాదశులను విశేషదాయకంగా పరిగణిస్తాము. అవి:
• ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి)
• కార్తీక శుద్ధ ఏకాదశి
• పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశ.....
గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః
యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిఃసృతా
గీత శ్రీపద్మనాభుడైన విష్ణుభగవానుని ముఖారవిందము నుండి వెల్వడిందని వ్యాసుడు భగవద్గీతను వర్ణిస్తూ తెలిపాడు. భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామంలో భోధించాడని అందరికి తెలుసు. కానీ భగవద్గీత ఆవిర్భావం సంగ్రామం పదకొండవనాడు .....
ఆదిత్యుడు అంటే సూర్యుడు. సూర్యునికి సవిత, రవి, అర్కుడు, భాస్కరుడు, భానుడు, దినమణి, దివాకరుడు, ప్రభాకరుడు ఇలా అనేక పేర్లున్నాయి. ఈ పేర్లన్ని సూర్యుని శక్తి సామర్ధ్యాలను, గుణగణాలను వివరిస్తాయి. ‘ఆదిత్యానాం మహా విష్ణుః’ అని గీత మనకు చెపుతోంది. ఆదిత్యులు పన్నెండు మంది, అందులో ఆద్యుడు విష్ణువు. విష్ణువును ఉద్దేశించి చెప్పిన స్త్రోతమవుట చే.....
10. బ్రహ్మవైవర్త పురాణము
రథంత కల్పస్య వృత్తాంత మధికృత్య చ|
సావర్ణినా నారదాయ కృష్ణ మాహాత్మ్య సంయుతం ||
చరితం బ్రహ్మ వరాహస్య చరితం వర్ణ్యతేzత్ర చ|
తదష్టా దశసాహస్రం బ్రహ్మవైవర్తముచ్యతే ||
వరాహస్వామి, శ్రీకృష్ణునికి సంబంధించిన వృత్తాంతాన్ని సావర్ణి మనువు నారద మహర్షికి రథంతర కల్పంలో మొట్టమొదటిసారిగా తెలిపినదే ఈ బ్రహ్మవైవర్త పురాణమని స.....
వాయు పురాణం
అష్టాదశ పురాణాలలో నాలుగవదైన వాయు పురాణాన్ని శ్వేత కల్పంలో శివుడు వాయువుకు మొట్టమొదటిసారిగా బోధించాడు. ‘చతుర్వింశతి సాహస్రం పురాణం తదిహోచ్చతే’ అన్న శ్లోకానుసారం ఇరువది నాలుగువేల శ్లోకాలున్న ఈ వాయు పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమభాగంగా కీర్తించబడింది. అయితే ఇందు కేవలం 11వేల శ్లోకాలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. .....
1. బ్రహ్మపురాణం
‘ఆద్యం సర్వపురాణానాం, పురాణం బ్రహ్మముచ్యతే
అష్టాదశ పురాణాని పురాణాజ్ఞాః ప్రచక్ష్యతే
అష్టాదశ పురాణాల్లో మొదటిది బ్రహ్మపురాణంగా విష్ణుపురాణం పేర్కొంది. అలాగే ‘రాజ సేషుచ మాహత్మ్య మధికం బ్రహ్మణోవిదుః’ అని మత్స్యపురాణం బ్రహ్మపురాణాన్ని రాజసపురాణంగా చెప్పింది. ‘బ్రహ్మం మూర్దా హరేరేవ’ అనే శ్లోకానుసారం మహావిష్ణువ.....
‘‘సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణమ్’’
సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం మరియు వంశానుచరితమనే ఐదు లక్షణాలు కలిగినదే పురాణం. సర్గ అనగా ప్రపంచం సృష్టి, ప్రతిసర్గ – సమస్త ప్రపంచం యొక్క ప్రళయం, వంశం – రాజులు మరియు ఋషుల సంతాన పరంపర, మన్వంతం – మనువు, మనుపుత్రులు, ఋషులు, దేవతలు, ఇంద్రుడు మరియు విష్ణువు యొక.....
పూరీ జగన్నాథ రథయాత్రకి ప్రప్రంచ ప్రసిద్ధి ఉంది. ‘పురుషోత్తమ క్షేత్రం’గా పురాణాలలో వర్ణింపబడే ఈ పావన ధామం అద్భుతాలకు ఆలవాలం. ‘జగన్నాథ స్వామి నయన పథగామీ భవతుమే’ అని ఆదిశంకర భగవత్పాదులు ఈ స్వామి తన కళ్లముందు నిరంతరం కదలాడాలని ప్రార్ధించి, తన నాలుగు పీఠాలలో ఒక దానిని ఇక్కడే ప్రతిష్టించాడు.జయదేవుని ‘గీతగోవిందం ’ఈ స్వామి ఆరాధనయే.
‘ఇ.....
వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేద: ప్రాచేతసా దాసీత్ సాక్షాద్రామాయణాత్మనా
పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడు దశరథాత్ముజుడైన రాముడిగా అవతరించగా పరమాత్మ గుణవర్ణనైక పరాయణమగు వేదము వాల్మీకి మహర్షి నోట శ్రీమద్రామయణ రూపంలో వెలువడిందని ఈ శ్లోకం అర్ధం. భారతీయ సంస్కృతి కాధారమై, దానిని సర్వప్రశంసా పాత్రముగా చేసిన కుటుంబ జీవితానికి.....