ఆధ్యాత్మికము

ఆధ్యాత్మికము

మేలిమి గుణాలు, శోభ, కళ, సంపద, ఉత్సాహం, ఆనందం, శాంతం, సామరస్యం, సౌమనస్యం .... ఈ శుభ గుణాలకు సాకారమే శ్రీ లక్ష్మి. ఈ శుభగుణాలే ప్రతివారు ఆశించేవి. అందుకే లక్ష్మీ ఆరాధన. శ్రావణ మాసం కొత్తందాలు, కొత్త మొలకలు, పచ్చదనాలు మొదలయ్యే చల్లని నెల. వర్షాకాల వైభవంలో శ్రావణమాసం పవిత్రమైన దేవీ పూజలకు తరుణం. ‘ఆర్ద్రాం పుష్కరిణీం’ అని శ్రీ సూక్తం వర్ణించినట.....
8. శ్రీ ఏకవీరాదేవి – మహుర్వం: దత్తాత్రేయ సమారాధ్యా అవసూయాత్రిసేవితా | ఏకవీర మహాదేవీ మస్తకే నైవశోభినీ | రేణుకా మాతా శ్రీక్షేత్రా మాయా సంహార రూపిణీ | కృపయాపాతునస్సర్వాం మయూరే ఏకవీర్యా || అమ్మవారి కుడి చేయి ఈ ప్రాంతంలో పడింది. తండ్రి జమదగ్ని ఆజ్ఞతో పరశురాముడు తల్లి, సోదరుల తలలు నరికేశాడు. తల్లి శిరస్సు పడిన ప్రాంతమే ఈ క్షేత్రమని కూడా కథ.....
భారతదేశంలో విభిన్న సాంప్రదాయాలకు, ఆచారాలకు పుట్టినిల్లు. పేర్లు, పద్దతులు వేరైనా కొన్ని పండగలు దేశమంతటా ప్రసిద్ది చెందాయి. శ్రావణమాసంలో మంగళగౌరి వ్రతాలు పూర్తికాగానే భాద్రపదమాసంలో గణపతి నవరాత్రులు ఇక ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు మన తెలుగువారే కాక ఉత్తర, దక్షిణాది వారంతా పెద్ద యెత్తున జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్లో దసరా ఉత్సావ.....
8.అగ్ని పురాణం ఈ అగ్ని పురాణము గురించి, దీని విశిష్టత గురించి ఇదే పురాణములో 271వ అధ్యాయములో ఈ విధంగా వివరింపబడి వుంది. అగ్నిరూపేణ దేవాదే ర్మఖం విష్ణు: పరాగతి: ఆగ్నేయ పురాణస్య వక్తా శ్రోతా జనార్ధన: తస్మాత్పురాణ మాగ్నేయం సర్వవేదమయం జగత్ సర్వవిద్యామయం పుణ్యం సర్వజ్ఞానమయం పరం సర్వాత్మహరిరూపం హి పఠతాం శృణ్వతాం నృణాం విద్యార్థినాం చ విద.....
హనుమంతుని చరిత్ర రామాయణంలోను, పరాశరసంహితలోను, అద్భుత, వివిత్ర, ఆనంద, జానపద రామాయాణాలలో అనేక విధంగా వివరించపడి ఉంది. హనుమంతుడు వైశాఖమాస కృష్ణపక్షమున శనివారం పూర్వాభాద్రా నక్షత్రమందు వైధృతి యోగమున మధ్యాహ్న సమయమందు కర్కాటక లగ్నాన కౌండిన్య గోత్రమున జన్మించాడు. 'రామాయణ మహామాలా రత్నం వందే నిహత్మిజం' అని కీర్తింపపడే హనుమంతుడు, వేదములన.....
రామాయణ, భారత, భాగవతాలు మన జనజీవన స్రవంతిలో మిళితమై, మన కళలను కూడా ప్రభావితం చేశాయి. శిష్టులకు పురాణేతిహాసాలు కావ్యాల రూపంలో అందుబాటులో ఉంటే, పామరులకు ఆ లోటును మన జానపద కళలు తీర్చాయి. రామాయణం ఈ విషయంలో ముందుందని చెప్పవచ్చు. రసమయ రామాయణం ఒక తరం నుంచి మరో తరానికి అందచేయటంలో జానపద గేయాలు ఎంతగానో ఉపకరించాయంటే అతిశయోక్తి కాదేమో. ఈ సందర్భంగ.....
విశ్వమంతా వ్యాపించి, నిర్వహించే పరమచైతన్యి జగదంబగా ఆరాధించే సాంప్రదాయం శాక్తేయం. ఏ ‘శక్తి’ వలన బ్రహ్మాదిపిపీలిక పర్యంతం చేతనమవుతున్నదో ఆ శక్తే దేవి. వేదాలు మొదలుకొని పురాగమాల వరకు ఆ జగన్మాతను దేవీ నామంతో కీర్తించాయి. ఈ నామానికి ‘ప్రకాశ స్వరూపిణి’ అని అర్ధం. అన్నింటికీ చైతన్యాన్ని ప్రసాదించే స్వయంప్రకాశక శక్తి దేవి. మరొక అర్ధం క్.....
విఘ్నసంహారానికి అవతరించిన పరబ్రహ్మయే గణపతి. సృష్టికి పూర్వమే బ్రహ్మకు విఘ్నాలు కలుగినప్పుడు, బ్రహ్మ ఓంకార ధ్యానంచేయగా, ఆ ఓంకారమే వక్రతుండ స్వరూపంగా సాక్షాత్కరించి విఘ్నాలను తొలగించింది. ఆ ప్రణవతేజమే అటుతర్వాత పార్వతీపరమేశ్వరుల పుత్రునిగా ఆవిర్భవించింది. శివశక్తుల సమైక్యతత్త్వం, ప్రకృతీపురుషుల ఏకత్వం వినాయకమూర్తిలో ద్యోతక.....
సకల చరాచర జగత్తు యొక్క ఆవిర్భావానికి, క్రమబద్ధమైన ఆజగత్ర్పవర్తనకు ఆధారభూతము పరాశక్తే. తృణము నుండి మహాపర్వతము వరకు ప్రతి పరమాణవులో నిక్షిప్తమై ప్రకాశించు మహాశక్తి స్వరూపమా పరదేవత. ఆ శక్తియే పరబ్రహ్మము, సకల ప్రాణికోటిని చైతన్యపర్చే మహా తేజము, తుదకు బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు కూడా చైతన్యాన్ని ఒసగే శక్తి రూపమైన ఆ పరమేశ్వరి సగుణసాకార .....
దిబ్బు, దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగులచవితి అంటూ పిల్లల చేత దివిటీలు కొట్టిస్తూ, ఇల్లంతా దీపాలు అలంకరించి, మతాబులు, టపాకాయలు వెలిగిస్తూ సందడిగా సాగే దీపావళి పండుగ కోసం చిన్నా, పెద్ద అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. దీపావళి పదాన్ని విడదీస్తే దీప+ఆవళి అంటే, దీపాల యొక్క వరుస అని అర్థం. ఈ పండుగ చేసుకోవడానికి అనేక కథనాలు ప్రచారంల.....
సృష్టి, స్థితి లయకారిణి అయిన ఆదిపరాశక్తి అంశాలు అనేక శక్తి ప్రధాన క్షేత్రాలలో శక్తిపీఠాలుగా విశిష్టతను సంతరించుకున్నాయి. శివపురాణం మనకు ఈ శక్తిపీఠాల ఆవిర్భావ కథను తెలుపుతోంది. బ్రహ్మ సృష్టి ఆరంభంలో తొమ్మిది మంది ప్రజాపతుల్ని సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు. ఆయన కుమార్తె సతి తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా శివుడిని వివాహమాడు.....
7. మార్కండేయ పురాణం అష్టాదశ పురాణాలలో ఏడవదయిన మార్కండేయ పురాణాన్ని శ్వేతవరాహ కల్పంలో మార్కండేయుడు ప్రప్రథమంగా జైమినికి బోధించాడు. నూటముప్పది నాలగు అధ్యాయాలు, తొమ్మిదివేల శ్లోకాలు కల్గిన మార్కండేయ పురాణం విష్ణుమూర్తి కుడిపాదంగా అభివర్ణిస్తారు. అయితే ఇందు కేవలం 6900 శ్లోకాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఈ పురాణమందు విస్తరస్త్రోతకీర్.....