ఆధ్యాత్మికము

ఆధ్యాత్మికము

ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ సనాతన ధర్మం మనకిచ్చిన రెండు అద్భుత మహామంత్రాలివి. ఒక మంత్రం నారాయణుడిని స్మరిస్తే, మరొకటి శివుడిని ఆరాధిస్తుంది. మనలో కొందరికి మహేశ్వరుడి కారుణ్యమూ, ప్రసన్న రూపమూ, ఏ వరం కోరినా కాదనకుండా ప్రసాదించే భోళాతనమూ నచ్చుతాయి. మరి కొందరికి, సాత్విక గుణస్వరూపుడైన విష్ణుమూర్తి, ఆయన అనేక అవతారాలలో చేసిన లీలలు మహాప.....
చిగురింతతో మొదలై, ఆకురాలటంతో పూర్తయ్యే సంవత్సరచక్రం జీవగమన వైఖరి తెలియచేస్తుంది. చిగురింతలూ, శిశిరాలు జరిగినా వృక్షంలో మార్పుండదు. సంవత్సరాలు గడుస్తున్నా జగతిలోనూ మార్పుండదు. సృష్టి, స్థితిలయలకు సంవత్సరం ఒక ప్రతీక. ఉగం, యుగం ఈ రెండు ఒకే అర్ధంతో ప్రయోగించిన శబ్ధాలు. యుగానికి ఆది... యుగాది. కల్పాది కూడా ఇదే. ఈ శ్వేతవరహకల్పం, చైత్రశుద్.....
వసంత రుతువు ఆరంభంలో వచ్చే ప్రధాన పండుగ ఉగాది లేదా యుగాది. 'యుగము' అనగా ద్వయము లేక జంట అని అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. కాలక్రమేణా యుగాది ఉగాదిగా స్థిర పడింది. అయితే "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'. ‘ఉ’ అంటే ఉత్తమమైన ‘గ’ అంటే జ్ఞానం అనే అ.....
రామాయన్న పదమ్మువిన్న నిదె సర్వస్వమ్ము నుప్పొంగి, ఏ సామోద్గీథములో ధ్వనించు రసవేషా! నాడులే తంత్రులై ఆమోదమ్ముగ లీలగా బ్రతుకు తానై రామసంకీర్తన మ్మై మాధుర్య తరంగమౌను శుభధామా! రామచన్ద్రప్రభూ! సామము గీతాత్మక నాదం. దానికి సారం – ఓంకారం, అదే శ్రీరామ నామం. ఆ కారణంచేత, రామస్మరణ రసవంతమైన ప్రణవానికీ, ప్రణవ జన్యమైన గీతానికి హేతువౌతోంది. ఓంకార స.....
మాఘ బహుళ చతుర్దశినాడు మనం "మహాశివరాత్రి" పర్వదినం జరుపుకుంటాం. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే మహా శివరాత్రి. అథర్వణ వేద సంహితలో యుప స్తంభమునకు పూజించుతూ చేసే స్తుతిలో మొట్ట మొదటి సారిగా శివ లింగం గురుంచి చెప్పబడింది అంటారు. ఈ యుప స్తంభం/స్కంభం ఆద.....
శాక్తేయులానుసారం సృష్టి శివశక్తి విలసితము. దైవము, దేవత, సృష్టి, స్థితి, లయములు, కాలము, దేశము సర్వము శివశక్తిమయములు. పంచభూతములు, సూర్యచంద్రులు, అగ్ని అను అష్టమూర్తులు శివశక్తి సంయములు. ‘ఆస్తి’ అనగా ఉన్నది. శివుడు ఒక్కడే కాడు. శక్తితో కూడి ఉన్నదే ఉండుట. శివశక్తి ద్వయమే కాని ఒక్కటికాదు. ఆస్తి భాతి ప్రియం అయిన పరమాత్మ తానే రెండు రూపములు ధరి.....
ప్రపంచాన్ని సృష్టించి, వృద్ధిపొందించి, ధర్మమార్గమున నడిపి, అంతమొందించి, తన యందులీనమొనర్చుకునే సృష్టి ప్రక్రియను సృష్టి, స్థితి, లయకారుకులైన త్రిమూర్తులు నిర్వహిస్తుంటారు. ఈ సృష్టి ప్రక్రియ కనుగుణంగా ఆ పరమేశ్వరుడు అనేక రీతులలో నృత్యాన్ని ప్రదర్శించగా, తనువున సగభాగమైన పార్వతీ దేవీ సర్వేశ్వరునితో గూడి నర్తిస్తుంది. నటరాజు తన నివా.....
మాఘ శుద్ధ సప్తమినాడు మనం రథ సప్తమి జరుపుకుంటాం. ఈ రోజు సూర్య జయంతి. ఖగోళ శాస్త్రం ప్రకారం చూసిన ఈ రోజుకి విశిష్టత ఉంది. ఈ రోజు నుంచే సూర్యుడు తన సంచార గతిని మార్చుకుని ఉత్తర దిశవపైపు పయనం ఈరోజే ప్రారంభస్తాడు. భూమి, సూర్యునికి దగ్గరవటం ఆరంభిస్తుంది. సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమనీ, సర్వభూతాలు ఆయన వల్లే ఏర్పడ్డాయనీ, సూర్యుడే పరబ్రహ్మ (నమ.....
12. వరాహ పురాణం శ్రీమహావిష్ణువు ఎడమచీలమండలంగా అభివర్ణించే ఈ పురాణం అష్టాదశ పురాణాలలో పన్నెండవది. ‘విష్ణునా భిహితం క్షోణ్యై తద్వారాహముచ్యతే’ అన్న శ్లోకాన్ని బట్టి ఈ పురాణాన్ని శ్రీమహావిష్ణువు వరాహావతారాన్ని ధరించినప్పుడు భూదేవికి వినిపించాడని తెలుస్తోంది. కాగా మనుకల్పంలో విష్ణువు పృథ్వికి మొట్టమొదటసారిగా బోధించిన ఈ వరాహ పురా.....
సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన నాటినుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుస్సు అపూ పదానికి ధర్మం అని అర్ధం. ‘ధనుర్మాసం’ అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ఈ మాసం వైష్ణవులకు ఎంతో ప్రీతికరమైనది. సంక్రాంతికి నెలరోజుల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అలంకారప్రియుడైన విష్ణువును బ్రాహ్మీ ముహర్తంలో పంచామృతంతో అభిషేకించి, .....
‘తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్ధసార సంగ్రహమ్,’ వేదాంతసారమంతా భగవద్గీతలో నిక్షిప్తమయుంది. అటువంటి ఉపనిషత్తులసారాన్ని, సర్వోపనిషదో గావో దోగ్దా గోపాలనన్ధనః పార్ధో వత్సః సుధీర్భోక్తా దుగ్దమ్ గీతామృతం మహత్ శ్రీకృష్ణభగవానుడు ఉపనిషత్తులనే గోవుల నుంచి అర్జునుడనే దూడ కోసం గీత అనే అమృతాన్ని పితికి అందించాడు. ఈ అమృతం భగవద్గీత పఠించ.....
మన తెలుగునాట అనేక పండుగలు ప్రకృతితో, ఋతుపరివర్తనతో ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా పంటలు చేతికి వచ్చిన సందర్భంగా జానపదులు ఉత్సాహంతో తమకు ఆనందాన్ని కల్గించిన పుడమితల్లిని, పశుసంపదను పూజించి కృతజ్ఞతలు తెలుపుకుని పండుగలు జరుపుకుంటారు. తెలంగాణా ప్రాంతీయులు జరుపుకునే అలాంటి విశేషమైన పండుగలే బతుకమ్మ -బొడ్డెమ్మ పండుగలు. వినాయక చవితి లేదా భ.....