
విఘ్నసంహారానికి అవతరించిన పరబ్రహ్మయే గణపతి. సృష్టికి పూర్వమే బ్రహ్మకు విఘ్నాలు కలుగినప్పుడు, బ్రహ్మ ఓంకార ధ్యానంచేయగా, ఆ ఓంకారమే వక్రతుండ స్వరూపంగా సాక్షాత్కరించి విఘ్నాలను తొలగించింది. ఆ ప్రణవతేజమే అటుతర్వాత పార్వతీపరమేశ్వరుల పుత్రునిగా ఆవిర్భవించింది. శివశక్తుల సమైక్యతత్త్వం, ప్రకృతీపురుషుల ఏకత్వం వినాయకమూర్తిలో ద్యోతక.....
మేలిమి గుణాలు, శోభ, కళ, సంపద, ఉత్సాహం, ఆనందం, శాంతం, సామరస్యం, సౌమనస్యం .... ఈ శుభ గుణాలకు సాకారమే శ్రీ లక్ష్మి. ఈ శుభగుణాలే ప్రతివారు ఆశించేవి. అందుకే లక్ష్మీ ఆరాధన.
శ్రావణ మాసం కొత్తందాలు, కొత్త మొలకలు, పచ్చదనాలు మొదలయ్యే చల్లని నెల. వర్షాకాల వైభవంలో శ్రావణమాసం పవిత్రమైన దేవీ పూజలకు తరుణం. ‘ఆర్ద్రాం పుష్కరిణీం’ అని శ్రీ సూక్తం వర్ణించినట.....
రామాయణ, భారత, భాగవతాలు మన జనజీవన స్రవంతిలో మిళితమై, మన కళలను కూడా ప్రభావితం చేశాయి. శిష్టులకు పురాణేతిహాసాలు కావ్యాల రూపంలో అందుబాటులో ఉంటే, పామరులకు ఆ లోటును మన జానపద కళలు తీర్చాయి. రామాయణం ఈ విషయంలో ముందుందని చెప్పవచ్చు. రసమయ రామాయణం ఒక తరం నుంచి మరో తరానికి అందచేయటంలో జానపద గేయాలు ఎంతగానో ఉపకరించాయంటే అతిశయోక్తి కాదేమో. ఈ సందర్భంగ.....
మాఘ బహుళ చతుర్దశినాడు మనం "మహాశివరాత్రి" పర్వదినం జరుపుకుంటాం. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే మహా శివరాత్రి. అథర్వణ వేద సంహితలో యుప స్తంభమునకు పూజించుతూ చేసే స్తుతిలో మొట్ట మొదటి సారిగా శివ లింగం గురుంచి చెప్పబడింది అంటారు. ఈ యుప స్తంభం/స్కంభం ఆద.....
శాక్తేయులానుసారం సృష్టి శివశక్తి విలసితము. దైవము, దేవత, సృష్టి, స్థితి, లయములు, కాలము, దేశము సర్వము శివశక్తిమయములు. పంచభూతములు, సూర్యచంద్రులు, అగ్ని అను అష్టమూర్తులు శివశక్తి సంయములు. ‘ఆస్తి’ అనగా ఉన్నది. శివుడు ఒక్కడే కాడు. శక్తితో కూడి ఉన్నదే ఉండుట. శివశక్తి ద్వయమే కాని ఒక్కటికాదు. ఆస్తి భాతి ప్రియం అయిన పరమాత్మ తానే రెండు రూపములు ధరి.....
ప్రపంచాన్ని సృష్టించి, వృద్ధిపొందించి, ధర్మమార్గమున నడిపి, అంతమొందించి, తన యందులీనమొనర్చుకునే సృష్టి ప్రక్రియను సృష్టి, స్థితి, లయకారుకులైన త్రిమూర్తులు నిర్వహిస్తుంటారు. ఈ సృష్టి ప్రక్రియ కనుగుణంగా ఆ పరమేశ్వరుడు అనేక రీతులలో నృత్యాన్ని ప్రదర్శించగా, తనువున సగభాగమైన పార్వతీ దేవీ సర్వేశ్వరునితో గూడి నర్తిస్తుంది. నటరాజు తన నివా.....
ఓం నమః శివాయ
ఓం నమో నారాయణాయ
సనాతన ధర్మం మనకిచ్చిన రెండు అద్భుత మహామంత్రాలివి. ఒక మంత్రం నారాయణుడిని స్మరిస్తే, మరొకటి శివుడిని ఆరాధిస్తుంది. మనలో కొందరికి మహేశ్వరుడి కారుణ్యమూ, ప్రసన్న రూపమూ, ఏ వరం కోరినా కాదనకుండా ప్రసాదించే భోళాతనమూ నచ్చుతాయి. మరి కొందరికి, సాత్విక గుణస్వరూపుడైన విష్ణుమూర్తి, ఆయన అనేక అవతారాలలో చేసిన లీలలు మహాప.....
రామాయన్న పదమ్మువిన్న నిదె సర్వస్వమ్ము నుప్పొంగి, ఏ
సామోద్గీథములో ధ్వనించు రసవేషా! నాడులే తంత్రులై
ఆమోదమ్ముగ లీలగా బ్రతుకు తానై రామసంకీర్తన
మ్మై మాధుర్య తరంగమౌను శుభధామా! రామచన్ద్రప్రభూ!
సామము గీతాత్మక నాదం. దానికి సారం – ఓంకారం, అదే శ్రీరామ నామం. ఆ కారణంచేత, రామస్మరణ రసవంతమైన ప్రణవానికీ, ప్రణవ జన్యమైన గీతానికి హేతువౌతోంది. ఓంకార స.....
సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన నాటినుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుస్సు అపూ పదానికి ధర్మం అని అర్ధం. ‘ధనుర్మాసం’ అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ఈ మాసం వైష్ణవులకు ఎంతో ప్రీతికరమైనది. సంక్రాంతికి నెలరోజుల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అలంకారప్రియుడైన విష్ణువును బ్రాహ్మీ ముహర్తంలో పంచామృతంతో అభిషేకించి, .....
హనుమంతుని చరిత్ర రామాయణంలోను, పరాశరసంహితలోను, అద్భుత, వివిత్ర, ఆనంద, జానపద రామాయాణాలలో అనేక విధంగా వివరించపడి ఉంది. హనుమంతుడు వైశాఖమాస కృష్ణపక్షమున శనివారం పూర్వాభాద్రా నక్షత్రమందు వైధృతి యోగమున మధ్యాహ్న సమయమందు కర్కాటక లగ్నాన కౌండిన్య గోత్రమున జన్మించాడు.
'రామాయణ మహామాలా రత్నం వందే నిహత్మిజం' అని కీర్తింపపడే హనుమంతుడు, వేదములన.....
8.అగ్ని పురాణం
ఈ అగ్ని పురాణము గురించి, దీని విశిష్టత గురించి ఇదే పురాణములో 271వ అధ్యాయములో ఈ విధంగా వివరింపబడి వుంది.
అగ్నిరూపేణ దేవాదే ర్మఖం విష్ణు: పరాగతి:
ఆగ్నేయ పురాణస్య వక్తా శ్రోతా జనార్ధన:
తస్మాత్పురాణ మాగ్నేయం సర్వవేదమయం జగత్
సర్వవిద్యామయం పుణ్యం సర్వజ్ఞానమయం పరం
సర్వాత్మహరిరూపం హి పఠతాం శృణ్వతాం నృణాం
విద్యార్థినాం చ విద.....
సకల చరాచర జగత్తు యొక్క ఆవిర్భావానికి, క్రమబద్ధమైన ఆజగత్ర్పవర్తనకు ఆధారభూతము పరాశక్తే. తృణము నుండి మహాపర్వతము వరకు ప్రతి పరమాణవులో నిక్షిప్తమై ప్రకాశించు మహాశక్తి స్వరూపమా పరదేవత. ఆ శక్తియే పరబ్రహ్మము, సకల ప్రాణికోటిని చైతన్యపర్చే మహా తేజము, తుదకు బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు కూడా చైతన్యాన్ని ఒసగే శక్తి రూపమైన ఆ పరమేశ్వరి సగుణసాకార .....