పద్య సౌరభం

పద్య సౌరభం

సలిలతరామనామజపసారమెరుంగను కాశికాపురీ నిలయుడగాను, మీ చరణనీరజరేణుమహాప్రభావముం తెలియ నహల్యగాను, జగతీవర, నీదగు సత్యవాక్యముం తలపగ రావణాసురుని తమ్ముడగాను, భవద్విలాసమున్ తలచి నుతింప నాతరమె? దాశరథీ కరుణాపయోనిధి భావం: నీ నామపారయణం చేత కలిగే శక్తి కాశీ విశ్వేశ్వరుడికి తెలియును. నీ పాదదూళి యొక్క మహిమ అహల్యా దేవికి తెలియును. నీ సత్యవాక్కులో.....
దండమయా విశ్వంభర దండమయా, పుండరీకదళనేత్ర హరీ దండమయా, కరుణానిధి దండమయా, నీకు నెపుడు దండము కృష్ణా భావం: విశ్వాన్ని ధరించిన విశ్వాకారా, తెల్లని కలువ రేకుల వంటి కన్నులు కలిగిన వాడా, కరుణా సముద్రుడా, నీకెప్పుడు శతకోని నమస్కారములు కృష్ణా. ...
న యత్ర సూర్యోన విధుర్న వహ్ని ర్నభిన్నతా న త్రిగుణావభాసః చరంతమానందమయే మహిమ్ని మృడం భజామో మృగితం మునీంద్రైః భావం: సూర్యుడుకాని, చంద్రుడుకాని, అగ్నికాని ప్రవేశింపని భిన్నత్వములేని, త్రిగుణములు లేని, ఆనందమయమైన మహిమోపేతమైన, స్థానమునందు వెలుగొందునట్టి, మునీంద్రులు అన్వేషించునట్టి శివుని భజించెదము. ...
కొడుకులు పుట్టరటంచు నేడ్తురవివేకు లీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ వడసెంపుత్రులు కాని ఆ శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్ చెడనే మోక్షపదంబు పుత్రునకున్ శ్రీకాళహస్తీశ్వరా. భావం: జీవితం మీద భ్రాంతి కలిగిన అవివేకులు కొందరు కొడుకులు పుట్టలేదని ఏడుస్తుంటారు. కాని కొడుకులు అనేకమంది పుట్టలేదా? కౌరవేంద్.....
సీ. ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు ద్రవ్యమిమ్మని వెంట దగులలేదు కనకమిమ్మని చాల గష్టపెట్టలేదు పల్లకిమ్మనినోటఁ బలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలము నిమ్మని నిన్ను బతిమాలగా లేదు పనుల నిమ్మని పట్టు పట్టలేదు తే. నే గోరిన దొక్కటే నీలవర్ణ చయ్యనను మోక్షమిచ్చినఁ చాలునాకు భ.....
సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు గౌరవ మొసంగు జనులకు కలుషమడుచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తిజేయు సాధుసంగంబు సకలార్ధ సాధనంబు భావం: సజ్జనులతో సాంగత్యం చేయడం అన్ని విధాల మంచిది. సత్యవంతుడుగా చేస్తుంది. బుద్దిబలాన్ని చేకూరుస్తుంది. గౌరవాన్నిస్తుంది. మనలోని లోపాలను పోగొడుతుంది. కీర్తి కలిగిస్తుంది. ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఒకటేమ.....
అంతరంగమందు నపరాధములు చేసి మంచి వానివలెనె మనుసు డుండు ఇతరులరుగకున్న నీశ్వరుడెరుగడా? విశ్వదాభిరామ వినురవేమ భావం: మనిషి తన మనస్సులో ఎన్నో దురాలోచనలు చేస్తూ ఎవరికి తెలియకుండా తెలివిగా తప్పించుకుంటాడు. సమాజంలో పెద్దమనిషిలా చెలామణీ అవుతుంటాడు. ఇతరులు తెలుసుకోకున్నా సర్వాంతర్యామి భగవంతుడు తెలుసుకోకుండా ఉంటాడా. ...
తనయునికిని పరదేశికి పెనిమిటికిని నొక్కరీతి విం దిడియెడు వా వనితను పుణ్యాంగన యని ఘనులందురు కుందవరపు కవి చౌడప్పా భావం: భోజనం దగ్గర పంక్తిలో ఫలభేదం చేయకూడదంటారు. తన కొడుక్కు, అతిథికి, భర్తకు ఒకే విధంగా వడ్డించే వనితను పుణ్యాత్మురాలంటారు. ...
విద్య యొసఁగును వినయంబు వినయమునను బడయు పాత్రత పాత్రత వలన ధనము ధనము వలన ధర్మంబు దానివలన నైహికాముష్మిక సుఖములందు నరుడు. భావం: విద్య వినయాన్ని, అణుకువను నేర్పుతుంది. వినయం వల్ల యోగ్యత కలుగుతుంది. యోగ్యత వల్ల ధనం లభిస్తుంది. ధనం వల్ల మంచి పనులు చేసే అవకాశాలు మెరుగవుతాయి. మంచి పనులు చేస్తే మనిషికి ఇహలోక, పరలోక సుఖాలు లభ్యమవుతాయి. ...
వెలకాంత లెందరైనను కులకాంతకు సాటిరారు కువలయ మందున్ పలు విద్య లెన్ని నేర్చిన కుల విద్యకు పాటిరావు గువ్వల చెన్నా. భావం: వేశ్యలెంతమంది ఉన్నా, తన భార్యతో సమానంకారు. అలాగే ఎన్ని విద్యలు నేర్చినా కుల విద్యకు సాటిరాదు. ...
సీ. తల్లి గర్భమునుండి ధనము తేడెవ్వడు వెళ్లిపోయిననాడు వెంటరాదు లక్షాధికారైనా లవణ మన్నమె కాని మెఱుగు బంగారంబు మ్రింగబోడు విత్త మార్జన జేసి విఱ్ఱవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడువ బోడు పొందుగా మఱుగైన భూమిలోపల బెట్టి దానధర్మము లేక దాచి దాచి తే. తుగకు దొంగలకిత్తురో దొరల కవునో తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు? భూషణవికాస! శ్రీధర్మ పురని.....
తివిరి యిసుమను తైలంబు తీయవచ్చు తవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు చేరి మూర్ఖల మనసు రజింపరాదు భావం: ఇసుకును పిండైనా సరే అతికష్టమ్మీద దానిలోంచి నూనె తీయవచ్చు. ఎండమావ్వుల్లోంచి నీళ్లు తాగవచ్చు. కావాలనుకుంటే లోకమంతా తిరిగి ఎక్కడైనా కుందేటి కొమ్ము సాధించవచ్చు. కాని మూర్ఖుని మనసు సంతోషపెట్టడం చాలా కష్టం. ...