document.write ("
కృష్ణుడు గీతలో తనను ఎవరు ఎలా ధ్యానిస్తే వారికి ఆ రూపంలో కన్పిస్తానని చెపుతాడు. ఇదే భావనను కృష్ణునితో రాసక్రీడలాడే సందర్భంలో పోతన వర్ణించిన భాగవతంలోని పద్యం.
వనితా! కృష్ణుని నల్లని మేఘమనియున్
వేణురవము గర్జన మనియున్
మనమున దలంచి రొప్పుచు ననవరతము
నెమలి తుటుములాడెడికంటె
కృష్ణుడు మేఘమనుకునీ, వేణునాదం గర్జనమనుకునీ, నెమళ్లు భ్రాంతిపడి ఆనందనాట్యం చేస్తున్నాయని ఈ పద్య భావం.